- రాష్ట్ర సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్
జైపూర్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి రైసుమిల్లుల యాజమానులు సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ . శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలోని బీఎస్ వై రా రైస్ మిల్లు, టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైసుమిల్లులను ఎంక్వైరీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజీ రైసుమిల్లు నిర్వహకులు 2023--–24 ఖరీఫ్ సీజన్లో 2230 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు.
దీని విలువ రూ.5.5 కోట్లు ఉందని తెలిపారు.బీఎస్ వై రా రైసుమిల్లు 2022–23 రబీ,2023-24 ఖరీఫ్ సీజన్లో కలిపి 6 వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు.దీని విలువ సుమారు.రూ.15 కోట్లుగా నిర్ధారించామని తెలిపారు.ఇద్దరు రైసుమిల్లుల నిర్వహకులతో అగ్రిమెంట్ చేయించుకొని ఈ నెల 31లోగా బకాయిలు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.ఈ తనిఖీల్లో జిల్లా సివిల్ సప్లయ్ ఏ సీ ఎస్ ఓ.వేణుగోపాల్,డీటీ .స్రవంతి టాస్క్ఫోర్స్ సిబ్బంది.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.