- అదనపు స్పిల్ వే నిర్మించాలని ఎస్సీడీఎస్ నిర్ణయం
- రూ.92 కోట్లు ఖర్చవుతుందని అంచనా.. నిధులపై ఏపీతో చర్చలు
- గుండ్లవాగు ప్రాజెక్టు స్థానంలో కొత్త డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: పెద్దవాగు ప్రాజెక్టుకు మరో ఐదు గేట్లు ఏర్పాటు చేయాలని స్టేట్కమిటీ ఆన్డ్యామ్సేఫ్టీ (ఎస్సీడీఎస్) నిర్ణయించింది. పోయినేడాది జులైలో వచ్చిన భారీ వరదలకు పెద్దవాగు కట్ట తెగిపోయింది. ఈ నేపథ్యంలో దానికి శాశ్వత మరమ్మతులుగా ఐదు గేట్లతో అదనపు స్పిల్‌వే నిర్మించాలని ఎస్సీడీఎస్నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.92.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణలో కేవలం 2,360 ఎకరాల ఆయకట్టే ఉండగా, ఏపీలో మాత్రం 13,640 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో నిధుల అంశంపై ఏపీతో చర్చిస్తున్నట్టు ఎస్సీడీఎస్ తెలిపింది. గతంలో కట్టతెగిన వెంటనే తాత్కాలిక ఉపశమన చర్యలుగా రింగ్‌బండ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లిచ్చామని పేర్కొంది. బుధవారం హైదరాబాద్ లోని జలసౌధలో కమిటీ సమావేశం జరిగింది.
కొత్త డ్యామ్ కట్టాల్సిందే..
గుండ్లవాగు ప్రాజెక్టు స్థానంలో కొత్త డ్యామ్ నిర్మించాల్సిందేనని ఎస్సీడీఎస్ పేర్కొంది. గుండ్లవాగు ప్రాజెక్టు నిండిన ఒకట్రెండు రోజుల్లోనే లీకేజీలు, ఇతర సమస్యలతో ఖాళీ అయిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై జియోలాజికల్సర్వే ఆఫ్ఇండియా (జీఎస్ఐ) రిటైర్డ్డైరెక్టర్జనరల్ ఎం.రాజుతో కూడిన ఎక్స్పర్ట్స్ప్యానెల్ తో స్టడీ చేయించింది. ప్రాజెక్టు మొత్తం శిథిలావస్థకు చేరుకున్నదని, అక్కడ కొత్త ప్రాజెక్టును నిర్మించాలని ప్యానెల్ఫైనల్రిపోర్ట్లో సూచించిందని కమిటీ తెలిపింది.
అన్ని టెస్టులు, వరద ప్రవాహం, డిజైన్లు, నిర్మాణ పద్ధతులను కచ్చితత్వంతో చేపట్టాలని సూచించిందని పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫీల్డ్అధికారులకు ఇప్పటికే సూచించినట్టు తెలిపింది. కాగా, రాష్ట్రంలోని అన్ని మీడియం, మేజర్ప్రాజెక్టుల వద్ద వానాకాలం ముందు, ఆ తర్వాత చేయించాల్సిన పరీక్షలను చేయించామని.. వాటికి సంబంధించి తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారుల నుంచి రిపోర్ట్కూడా అడిగామని కమిటీ పేర్కొంది. స్పెసిఫైడ్డ్యామ్స్లిస్ట్నూ కమిటీ అప్‌డేట్‌చేసింది. 174 ప్రాజెక్టుల్లో పెద్దచెరువు, చెగావ్ప్రాజెక్టులను తీసేసి.. వాటి స్థానంలో చనాకా కొరాటా, సదర్మాట్ బ్యారేజీలను చేర్చింది.
కాళేశ్వరం బ్యారేజీలపై స్టడీ పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన స్టడీలు పూర్తయ్యాయని ఎస్సీడీఎస్ తెలిపింది. నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు మూడు బ్యారేజీల్లో అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. మేడిగడ్డ ఏడో బ్లాక్‌వద్ద టెస్టుల కోసం సెంట్రల్సాయిల్అండ్మినరల్రీసెర్చ్స్టేషన్(సీఎస్ఎంఆర్ఎస్), అన్నారం, సుందిళ్ల వద్ద సెంట్రల్వాటర్ పవర్ రీసెర్చ్‌స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో ఇన్వెస్టిగేషన్లు చేయించినట్టు పేర్కొంది. ఇప్పటికే ఆ ఇన్వెస్టిగేషన్స్‌కు సంబంధించిన నివేదికలను ఎన్డీఎస్ఏకు పంపించినట్టు తెలిపింది.