
రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటనకోసం బాగానే కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఢిల్లీలో మూడుసార్లు స్క్రినింగ్ కమిటీ భేటీ అయ్యింది. నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల పేర్లను పరిశీలించింది. ఫైనల్ జాబితాను రేపు శుక్రవారం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపనుంది స్క్రీనింగ్ కమిటీ. కొన్ని స్థానాలకు చివరివరకు వేచి చూడాలని ఆపార్టీ నాయకులు అనుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకటే పేరు, మరికొన్నింటికి మూడు పేర్లను ప్రతిపాదిస్తూ స్క్రీనింగ్ కమిటీ జాబితాను ఫైనల్ చేసింది. రేపు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేతలను పార్లమెంట్ బరిలో దింపాలని కూడా యోచిస్తోంది హైకమాండ్.