స్టేట్ ​కన్స్యూమర్​ ఫోరంలో 3,604 కేసులు పెండింగ్

స్టేట్ ​కన్స్యూమర్​ ఫోరంలో 3,604 కేసులు పెండింగ్
  • నెలలో 110 కేసులు మాత్రమే పరిష్కారం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టేట్​కన్స్యూమర్​ఫోరంలో మొత్తం 3,604  కేసులు పెండింగ్​లో ఉన్నాయి. 12 జిల్లా కమిషన్స్​లో మరో 4,175 కేసులు పెండింగ్​లో ఉన్నట్లు స్టేట్ ఫోరం ఇన్​చార్జి ప్రెసిడెంట్ మీనా రామనాథన్ వెల్లడించారు. మార్చి15న ఇంటర్ నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా గురువారం ఖైరతాబాద్​లోని స్టేట్ ఆఫీసులో ప్రెస్​మీట్​ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2021 సంవత్సరం పెండింగ్ కేసుల ప్రొసీడింగ్ నడుస్తున్నాయన్నారు.

యాక్ట్ ప్రకారం.. కేసు ఫైల్ అయిన 3 నుంచి --6 నెలల్లో పూర్తి చేయాలని, కరోనాతో 2020–21 వరకు కేసుల పరిష్కారం ఆగిపోవడం, కొత్తగా మరిన్ని కేసులు వచ్చి పడుతుండడంతో ఆలస్యం అవుతుందన్నారు. నెలకు 50 నుంచి 180 వరకు కొత్త కేసులు వస్తుండగా, సగటున110 కేసులు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2023 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు 2,416 కొత్త కేసులు ఫైల్ కాగా, కొత్త, పాతవి కలిపి 2,711 కేసులు పరిష్కరించామన్నారు. 12 జిల్లా కమిషన్స్​లో ఫిబ్రవరి చివరి వరకు1,10,041 కేసులు నమోదవగా.. 1,05,883 కేసులు పరిష్కరించామని మీనా రామనాథన్ పేర్కొన్నారు.