
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును శుక్రవారం ప్రాజెక్టు స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు పరిశీలించారు. హైడ్రో మెకానికల్ ఎక్స్పర్ట్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ,స్టేట్ డ్యాం సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ టి.ప్రమీల ప్రాజెక్టు అధికారులతో కలిసి వరద గేట్లు, కౌంటర్ వెయిట్లు, లిఫ్టింగ్ రోపులను పరిశీలించారు.
గేట్ల లిఫ్టింగ్ సమస్యలు, ప్రాజెక్టు స్థితిగతుల గురించి ఎస్ఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈఈలు విఠల్ రాథోడ్, విజయలక్ష్మి, జేఈలు నితిన్ కుమార్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.