ఒకటో తేదీనే పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి : జనరల్ సెక్రటరీ తూపురాణి సీతారాం

హనుమకొండ సిటీ, వెలుగు : రిటైర్డ్ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు చెల్లించాలని పెన్షనర్స్, రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ పర్సన్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ జనరల్ సెక్రటరీ తూపురాణి సీతారాం డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం హనుమకొండ ఏకశిలా పార్క్‌‌‌‌‌‌‌‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు అన్ని కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అందజేయాలని కోరారు.

కొత్త పీఆర్‌‌‌‌‌‌‌‌సీని అమలు చేయాలని, రెండు కరువు భత్యాలు ప్రకటించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం వరంగల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్య, హనుమకొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మహేందర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు బేతి శంకర్, లింగం, సముద్రాల లక్ష్మీనారాయణ, నాయకులు ఏ.విద్యాదేవి, కె. కళ పాల్గొన్నారు.