
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా పోలీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్ బుధవారం రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్దూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ జగదీశ్వర్ బెస్ట్ సిటిజన్ సర్వీస్ లో రాష్ట్రస్థాయిలో పదో స్థానం సాధించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ వర్టికల్, మహిళా కానిస్టేబుల్ కవిత ఐదో స్థానం పొందగా.. డీజీపీ జితేందర్ వారిద్దరిని సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. సీపీ డాక్టర్ బి. అనురాధ ఇరువురు సిబ్బందిని అభినందించారు.