ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తాం:రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తాం:రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
  • ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి
  • రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

జోగుళాంబ గద్వాల, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్  ఆకునూరి మురళి తెలిపారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం మల్లాపూర్ లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో అక్షరాస్యతను పెంచేందుకు విద్యకు సంబంధించిన పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడం, టీచర్ల కొరత, ప్రాథమిక స్థాయి విద్యలో నాణ్యత లోపం వంటి అంశాలను వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతాలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నానరు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చామన్నారు. సౌకర్యాల కల్పన కోసం  ప్రభుత్వానికి  ప్రతిపాదిస్తామన్నారు. కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వర రావు, గట్టు ఎంఈఓ నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.