గ్రేటర్‌లో పోలింగ్‌‌ స్టేషన్లను గుర్తించండి

గ్రేటర్‌లో పోలింగ్‌‌ స్టేషన్లను గుర్తించండి

గ్రేటర్ పరిధిలోని కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల కోసం పోలింగ్‌‌ కేంద్రాలను గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ సి. పార్థసారథి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత మున్సిపల్‌‌ పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి పదో తేదీతో ముగుస్తున్నందున ఆలోగా ఎన్నిలక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. శనివారం డ్రాఫ్ట్‌‌ ఓటర్ల జాబితా, ఈ నెల 13న ఫైనల్‌‌ ఓటర్ల జాబితాలు పబ్లిష్‌‌ చేయాలని సూచించారు. ఫైనల్‌‌ ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ పబ్లిష్‌‌ చేసినా.. ఎన్నికల నోటిఫికేషన్‌‌ వచ్చే వరకు దరఖాస్తు చేసుకునే వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాలన్నారు. గురువారం ఎస్‌‌ఈసీ కార్యాలయంలో జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌, హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌‌ కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లే  ప్రస్తుత ఎన్నికల్లోనూ వర్తిస్తాయని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున విశాలమైన గదుల్లో పోలింగ్‌‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  గ్రేటర్‌‌ మున్సిపల్‌‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయరాదని స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌‌ పార్థసారథి చెప్పారు.

For More News..

ఫిర్యాదు చేశామని మనసులో పెట్టుకొని టార్చర్ పెడుతుండు

అడవిబిడ్డలకు అన్యాయం చేస్తే జైలుకు పంపిస్తా

16 ఏండ్లయినా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్ట్