- రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలోని ప్రజలకు ఓటు హక్కు పై చైతన్యం కల్పించాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి కోరారు. ఆదివారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ పెండింగ్ 6,7,8 ఫామ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. దివ్యాంగ ఓటర్లను గుర్తించాలని, షెడ్యూల్ ప్రకారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని, నేతల సలహాలు, సూచనలు ఎన్నికల కమిషన్ కు పంపాలన్నారు. నాణ్యమైన ఓటరు ఏపిక్ కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలన్నారు.
ఓటు హక్కు పై అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలల్లో దివ్యాంగుల కోసం ర్యాంప్స్, మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె.వీర బ్రహ్మచారి, తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డీవోలు గణేశ్, కృష్ణవేణి, స్వీప్ నోడల్ అధికారి మధుసూదన రాజు, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి తదితరులు
పాల్గొన్నారు.