ప్రసాదాలు నాణ్యతతో ఉండాలి : దేవాదాయ శాఖ కమిషనర్​ శ్రీధర్

ప్రసాదాలు నాణ్యతతో ఉండాలి : దేవాదాయ శాఖ కమిషనర్​ శ్రీధర్
  • రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్​ శ్రీధర్​
  • భద్రాద్రి రామాలయంలో ఆకస్మిక తనిఖీలు

భద్రాచలం, వెలుగు :  సీతారామచంద్రస్వామి ఆలయంలో  రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్​శ్రీధర్​ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయంలోని వంటశాలకు వెళ్లి ప్రసాదాలకు వినియోగించే దిట్టం(సరుకులు) నాణ్యత పరిశీలించారు. ప్రసాదాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలని, సరుకుల నాణ్యతను కూడా చెక్ చేయాలని ఈవో రమాదేవికి సూచించారు. అనంతరం మిథిలాస్టేడియంలో ప్రసాద్​స్కీమ్ చేపట్టిన పనులను చూశారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై ఈఈ రవీందర్​తో చర్చించారు.

తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  అంతకు ముందు కమిషనర్​దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు గర్భగుడిలో నిర్వహించిన అభిషేకంలో పాల్గొన్నారు. కమిషనర్​ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, శేషవస్త్రం, జ్ఞాపికలను అందజేశారు.