స్థానిక సంస్థల అభివృద్ధికి సర్కార్‌‌‌‌ కృషి

స్థానిక సంస్థల అభివృద్ధికి సర్కార్‌‌‌‌ కృషి
  • స్టేట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సిరిసిల్ల రాజయ్య

హనుమకొండ, వెలుగు : గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్టేట్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సిరిసిల్ల రాజయ్య చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌ హాలులో బుధవారం నిర్వహించిన ఆర్థిక సంఘం రివ్యూకు ఆయనతో పాటు మెంబర్‌‌‌‌ సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు, వాటి కోసం చేసిన ఖర్చుల వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడంతో పాటు  ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ పంచాయతీల అధికారులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని,  పక్కా ప్రణాళిక ప్రకారం స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

స్థానిక సంస్థలపై విద్యుత్‌‌‌‌ ఛార్జీల భారం పడకుండా సోలార పవర్‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 60 రోజులకు ఒకసారి గ్రామసభ నిర్వహించేలా చూడాన్నారు. రివ్యూలో జిల్లా కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య, ఫైనాన్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ రమేశ్‌‌‌‌ నాయక్‌‌‌‌, నెహ్రునాయక్‌‌‌‌, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు పాల్గొన్నారు.