రాజమల్లు సేవలు చిరస్మరణీయం

రాజమల్లు సేవలు చిరస్మరణీయం

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు పేదల కోసం చేసినసేవలు చిరస్మరణీయమని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  సిరిసిల్ల రాజయ్య అన్నారు.  శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలో రాజమల్లు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమల్లు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ లీడర్లు మినుపాల ప్రకాశ్‌‌రావు, అన్నయ్య గౌడ్, డి.దామోదర్ రావు, చిలుక సతీశ్‌‌, రాజలింగం, తిరుపతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.