హైడ్రాతో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా : సాయి కుమార్

  • ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: హైడ్రాతో మత్స్యకారుల జీవనోపాధికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇస్తున్నారని స్టేట్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల చెరువులను కాపాడుతున్న రేవంత్ కు మత్స్యకారుల కుటుంబాలు రుణపడి ఉంటాయన్నారు. సోమవారం సాయి కుమార్ గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. హైడ్రాను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. 

చెరువులను, కుంటలను సంరక్షిస్తే రాష్ట్రంలో మత్స్యకారుల కుటుంబాలు వృత్తి పరంగా, ఆర్థికంగా ఎదుగుతాయని తెలిపారు. ప్రకృతిని కాపాడే చర్యలు చేపట్టినందుకు  తెలంగాణ మత్స్యకారుల తరఫున సీఎం రేవంత్ ను అభినందిస్తున్నట్లు సాయి కుమార్ పేర్కొన్నారు.