మత్స్యకారుల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం:రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్

మత్స్యకారుల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం:రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్
  • రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

పెద్దపల్లి, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని తమ్మ చెరువులో ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి,  మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు మేరకు అన్ని జిల్లాల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి చెరువుకు మూడు రకాల చేప పిల్లలు ఇస్తున్నామన్నారు. 

జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య, మున్సిపల్ చైర్​పర్సన్​ పెండ్రు రమాదేవి, వైస్ చైర్మన్ శ్రీపతి బాలయ్య, కౌన్సిలర్లు సమ్మయ్య, హనుమంతు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, జిల్లా డైరెక్టర్ పోతర వేణ క్రాంతి, గుండా రాజు పాల్గొన్నారు.