మాదాపూర్, వెలుగు: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ కార్పొరేట్ కాలేజీ సెంట్రల్ కిచెన్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సిటీలోని ఆ కాలేజ్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నిత్యం భోజనాలు ఇక్కడి నుంచే తీసుకెళ్తుండగా, కిచెన్ పరిసరాలను చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. రిఫ్రిజిరేటర్, కిచెన్ ఫ్లోరింగ్ మొత్తం ఫుడ్ వేస్టేజ్ పేరుకుపోయి కనిపించింది.
కిచెన్ నుంచి బయటకు వెళ్లే డ్రైనేజీ మొత్తం పగిలిపోయి దుర్వాసన రావడాన్ని అధికారులు గుర్తించారు. గడువు దాటిన 125 కేజీల కాజుని సీజ్ చేశారు. కిచెన్ లో ప్రతి చోట బొద్దింకలు, ఎలుకలు తిరుగుతూ ఉండడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు.