- ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్లు మాస్కులు ధరించాలి
- చైనాలో హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో వైద్య శాఖ గైడ్ లైన్స్
హైదరాబాద్, వెలుగు: చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటానిమోవైరస్) వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. అయినా.. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.
చేయాల్సినవి..
- దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కప్పుకోవాలి
- సబ్బు నీటితో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను తరచుగా కడగాలి
- రద్దీగా ఉండే ప్రదేశాలలోకి వెళ్లకుండా ఉంటే మంచిది
- ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి
- జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దు
- తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి
చేయకూడనివి..
- కరచాలనం(షేక్ హ్యాండ్స్)
- టిష్యూ పేపర్, కర్చీఫ్ మళ్లీ మళ్లీ వాడటం
- అనారోగ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు
- కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకడం
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం
- డాక్టర్ ను సంప్రదించకుండా మందులు తీసుకోవడం