సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారు కేవియట్ పిటిషన్​

సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారు కేవియట్ పిటిషన్​

న్యూఢిల్లీ, వెలుగు : ఫార్ములా – ఈ రేస్​ కేసులో తమ వాదనలను కూడా వినాలని  సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఏసీబీ అప్రమత్తమైంది. రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదన కూడా వినాలని మంగళవారం మధ్యాహ్నం(రాష్ట్ర హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే) ఏసీబీ కేవియట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే  కేటీఆర్ వేసే పిటిషన్ పై ఉత్తర్వులు వెలువరించాలని పిటిషన్ లో కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేసిన కొద్దిసేపటికే కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.