
- చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సభ్యులు
- అందరితో సంప్రదింపులు జరుపనున్న కమిటీ
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, సివిల్ సొసైటీ గ్రూప్స్, విద్యార్థుల ప్రతినిధి బృందం, స్టేక్హోల్టర్స్తో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరుపనుంది.
భూములు, పర్యావరణం తదితర అంశాలపై చర్చించనుంది. మంత్రులతో కమిటీ ఏర్పాటుపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పాటిస్తామని కమిటీ పేర్కొన్నది. కోర్టు కోరిన సమాచారాన్ని గడువులోపు పంపిస్తామని తెలిపింది. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని ఇంటెలిజెన్స్ డీజీ, సైబరాబాద్ కమిషనర్లను ఆదేశించినట్టు చెప్పింది.