టెన్త్ మెమోలపై పర్మినెంట్ నంబర్

టెన్త్ మెమోలపై పర్మినెంట్ నంబర్
  •     తొలిసారిగా అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్
  •     ప్రతి స్డూడెంట్​కు 11 అంకెలతో కూడిన నంబర్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని క్లాసుల స్టూడెంట్లకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)ను కేటాయించింది. ఈ క్రమంలోనే టెన్త్ మెమోలపై తొలిసారిగా ఈ నంబర్ ను ప్రింట్ చేయిస్తున్నది. ఇప్పటికే స్కూళ్లకు పంపించిన షాట్ మెమోల్లో ప్రింట్ చేయగా.. జులై/ఆగస్టు నెలల్లో అందించే లాంగ్ మెమోల్లోనూ ముద్రించనున్నారు. ప్రతి స్టూడెంట్ కు యూనిక్ నంబర్ ను అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ర్టాలకు ఆదేశాలు ఇచ్చింది. 2023–24 విద్యాసంవత్సరం నుంచి అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ కేటాయించాలని సూచించింది.

దీనికి యూడైస్ ప్లస్ డేటా ఆధారం చేసుకోవాలని తెలిపింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇటీవల టెన్త్ పాస్ అయిన స్టూడెంట్లకు దీన్ని అమలు చేస్తున్నారు. 11 అంకెలతో కూడిన ఈ  నంబర్ ను ప్రతి స్టూడెంట్ కు అలాట్ చేస్తున్నారు.  ఈ నంబర్ ద్వారా స్టూడెంట్‌‌ స్టడీ ట్రాక్ రికార్డును ఈజీగా తెలుసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. డ్రాపౌట్స్ రేట్లనూ నిరోధించవచ్చని పేర్కొంటున్నారు. అయితే, టెన్త్ మెమోలతో పాటు టీసీలపైనా పెన్ ప్రింట్ చేయాలని ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.