హైదరాబాద్, వెలుగు: పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.
ఇందుకు సంబంధించి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.