సెప్టెంబర్ 17 ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’

సెప్టెంబర్ 17 ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్‌‌‌‌ 17ను ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్‌‌‌‌ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌‌‌‌ 17న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్​లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం సెప్టెంబర్‌‌‌‌ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. 2022, 2023లో కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక నిర్వహిస్తున్నది. రెండు సార్లు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ‘‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’’గా ప్రకటించింది.