జీహెచ్​ఎంసీ కమిషనర్​గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు

జీహెచ్​ఎంసీ కమిషనర్​గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు
  • ఇతర డిపార్ట్​మెంట్ల నుంచి రిలీవ్​ 

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, హెచ్ఎండీఏ జాయింట్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్​ మేనేజింగ్​ డైరెక్టర్, హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్ (హెచ్​జీసీఎల్)​ ఎండీ బాధ్యతల నుంచి ఆమెను రిలీవ్​చేశారు. ఈ స్థానాల్లో మూసీ రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీగా దాన కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్​ఎండీఏ కమిషనర్​ సర్ఫరాజ్​కు హెచ్​జీసీఎల్​ ఎండీగా ఫుల్ అడిషనల్​చార్జ్​ ఇచ్చారు. 

జీహెచ్​ఎంసీ అడిషనల్​ కమిషనర్​ గా ఉన్న కోట శ్రీవాత్సను హెచ్​ఎండీఏ జాయింట్​ కమిషనర్​గా బదిలీ చేశారు. అలాగే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహత్ బాజ్​పేయిను నియమించారు. నారాయణపేట్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్​మయాంక్​ మిట్టల్​ను హైదరాబాద్​ మెట్రో వాటర్​ బోర్డు ఈడీగా నియమించారు.