భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వరద బాధితులకు సీఎం కేసీఆర్ సినిమా చూపించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. చుంచుపల్లి మండలంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగా కిరణ్ఇంట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందన్నారు. గతేడాది వచ్చిన వరదల టైంలో భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క పైసా ఇయ్యలేదన్నారు. భద్రాచలం టెంపుల్అభివృద్ధికి రూ.వంద కోట్లు ఇస్తామని ఏకంగా రాముడినే మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
వరదలపై ముందస్తు ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవన్నారు. కేంద్రం ఇచ్చిన ఎన్డీఆర్ఎఫ్ఫండ్స్దాదాపు రూ.900కోట్లపై శ్వేత పత్రం రిలీజ్చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్రం ప్రసాద్స్కీంలో భాగంగా రామాలయానికి రూ.98కోట్లు కేటాయించి రూ.42కోట్లతో పనులను చేపట్టిందన్నారు. తెలంగాణలో కేసీఆర్, పశ్చిమబెంగాల్లో మమత, తమిళనాడు స్టాలిన్ప్రభుత్వాలు అవినీతి, నియంతృత్వానికి కేరాఫ్‌గా మారాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగా కిరణ్ ని పొంగులేటి సన్మానించారు.