రాష్ర్ట ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు డైట్చార్జీలను పెంచింది. కామన్మెనూ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని రెసిడెన్షియల్పాఠశాలలను రాష్ర్ట, జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు.
విద్యార్థులతో కలిసి సహపక్తి భోజనం చేశారు. అక్కడ ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి రోజు విద్యార్థులకు మంచి భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. వారితో కలిసి భోజనం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను చూసిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. - వెలుగు, నెట్వర్క్