40 వేల కోట్లు ఇవ్వండి .. కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి

40 వేల కోట్లు ఇవ్వండి .. కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి
  • కేంద్ర బడ్జెట్​లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్ 
  • ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి
  • మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు నిధులివ్వండి
  • స్పోర్ట్స్, స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి
  • కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధులు పెంచాలి 
  • ఐఐఎం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు ఏర్పాటు చేయాలి
  • పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చేపట్టిన, చేపట్టనున్న కీలక ప్రాజెక్టు లకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం చేపట్టిన మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్​ఆర్, రేడియల్ ​రోడ్ల ప్రాజెక్టులు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలకు కనీసం రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. 

ఈ మేరకు కేంద్ర బడ్జెట్​లో కేటాయింపులు చేయాలని ప్రతిపాదనలు పంపించింది. రానున్న నాలుగేండ్ల పాటు ప్రతి బడ్జెట్​లోనూ ఇదే విధంగా కేటాయింపులు చేయాలని, అలా చేస్తే రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొంది. ఫలితంగా కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకనామీలో తెలంగాణ వన్​ట్రిలియన్ డాలర్లు​ కంట్రిబ్యూట్​ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. 

తెలంగాణకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న నిధులను రిలీజ్​చేయాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించిన నిధులను మళ్లించడంతో ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం లేదు. కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో భాగంగా నిధులు ఇస్తే, రాష్ట్ర వాటాను కూడా రిలీజ్​చేసి అమలు చేస్తాం” అని చెప్పింది. ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలని.. ఏపీకి ఇస్తున్నట్టే, తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరింది. 

రాష్ట్రం పంపిన ప్రతిపాదనలివీ.. 

  •   మూసీ పున‌‌‌‌‌‌‌‌రుజ్జీవంలో భాగంగా గోదావ‌‌‌‌‌‌‌‌రి నీటిని మూసీకి త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌లించేందుకు, గోదావ‌‌‌‌‌‌‌‌రి నుంచి 20 టీఎంసీలను హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ తాగునీటి అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌లించేందుకు రూ.7,440 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కేంద్రం ఇవ్వాలి. మూసీ రివ‌‌‌‌‌‌‌‌ర్ ఫ్రంట్ డెవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌‌‌‌‌‌‌‌ట్టనున్న గాంధీ స‌‌‌‌‌‌‌‌రోవ‌‌‌‌‌‌‌‌ర్ నిర్మాణం, మూసీ సీవ‌‌‌‌‌‌‌‌రేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెన‌‌‌‌‌‌‌‌ల నిర్మాణంతో పాటు ఇత‌‌‌‌‌‌‌‌ర ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు రూ.14,100 కోట్లు అవుతుంది. వీటికి కేంద్రం సహకారం అందించాలి. 
  •  ట్రిపుల్ ఆర్ నార్త్, సౌత్ కు అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో పాటు నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. ట్రిపుల్ ఆర్ తో పాటు రేడియ‌‌‌‌‌‌‌‌ల్ రోడ్లు వేస్తున్నాం. ఇవి పూర్తయితే ఫార్మా ప‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌తో పాటు ఇండ‌‌‌‌‌‌‌‌స్ట్రియ‌‌‌‌‌‌‌‌ల్ హ‌‌‌‌‌‌‌‌బ్ లు, లాజిస్టిక్ పార్క్స్‌‌‌‌‌‌‌‌, రీక్రియేష‌‌‌‌‌‌‌‌న్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు అంచ‌‌‌‌‌‌‌‌నా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ అనుసంధానానికి రేడియ‌‌‌‌‌‌‌‌ల్ రోడ్లు,10 గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రోడ్లతో పాటు ఓఆర్ఆర్ ను అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియ‌‌‌‌‌‌‌‌ల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు అవసరం. బడ్జెట్​లో ఆ మేరకు కేటాయింపులు చేయాలి.
  •  మెట్రో విస్తరణకు కేంద్రం సాయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50:50 వాటాతో మెట్రో ఫేజ్‌‌‌‌‌‌‌‌ను 2 చేప్టటేందుకు నిధులు కేటాయించాలి. మెట్రో ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు, రాయ‌‌‌‌‌‌‌‌దుర్గం నుంచి కోకాపేట్ నియోపోలీస్‌‌‌‌‌‌‌‌, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌గుట్ట, మియాపూర్‌‌‌‌‌‌‌‌- నుంచి ప‌‌‌‌‌‌‌‌టాన్ చెరు, ఎల్‌‌‌‌‌‌‌‌బీ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌ నుంచి -హ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌త్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ మ‌‌‌‌‌‌‌‌ధ్య మొత్తం 76.4 కిలోమీటర్లు నిర్మించేలా డీపీఆర్​కేంద్రానికి పంపినం. మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్లు ఖర్చవుతుంది.  
  •   రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఫ్యూచర్​సిటీలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలి. హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రంతో పాటు స‌‌‌‌‌‌‌‌మీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కిలోమీటర్ల మేర సీవ‌‌‌‌‌‌‌‌రేజీ నెట్‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్క్ ప‌‌‌‌‌‌‌‌నులకు రూ.17,212.69 కోట్లతో స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌గ్ర సీవ‌‌‌‌‌‌‌‌రేజీ కోసం అమృత్ 2 లేదా ప్రత్యేక ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలి. దాన్ని కేంద్రమే చేప‌‌‌‌‌‌‌‌ట్టాలి. వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్ లో అండ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లతో ప్లాన్ రూపొందించాం. దీన్ని అమృత్ 2 లేదా ప్రత్యేక ప‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌కం కింద చేపట్టాలి. 
  •   పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుతో కరువు, ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌ పీడిత నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వికారాబాద్‌‌‌‌‌‌‌‌, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.  
  •   వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌) కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు రూ.2 వేల కోట్లకు పైగా పెండింగ్​లో ఉన్నాయి. వాటిని రిలీజ్​ చేయాలి. కొత్తగా బడ్జెట్​లో మళ్లీ కేటాయింపులు చేయాలి. 
  •   రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కారిడార్లకు నిధులు ఇవ్వాలి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, జనగాం జిల్లాల్లో లెదర్‌‌‌‌‌‌‌‌ పార్కుల ఏర్పాటుకు నిధులు కేటాయించాలి.