హైదరాబాద్, వెలుగు: మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి రూ.100 కోట్ల నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో మున్సిపాలిటీలోని డ్రైనేజ్-లు, రోడ్ల రిపేర్-తో సహా మొత్తం 326 పనులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.