సారంగాపూర్, వెలుగు: సారంగాపూర్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ బీరవెల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలం ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలంటూ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. సారంగాపూర్ మండలంలోని ప్యారామూర్, తాండ్ర, వైకుంఠాపూర్, కంకేట, వంజర్, సించోలి(యం), జౌళి గ్రామాలతోపాటు దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామం బీరవెల్లి మండలంలో విలీనం కానున్నాయి. .
నూతన మండలం ఏర్పాటుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులను కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు.