రిటైర్డ్​ బెనిఫిట్స్​ ఇవ్వరా ..పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ

రిటైర్డ్​ బెనిఫిట్స్​ ఇవ్వరా ..పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ

ముషీరాబాద్, వెలుగు: పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరమని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం బారిన పడి చస్తున్నా పట్టించుకోరా ప్రశ్నించారు. 

సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింగరావు అధ్యక్షతన జరిగింది. రాజేంద్ర బాబు మాట్లాడుతూ పదవీ విరమణ బెనిఫిట్స్, జీపీఎఫ్ పైసలు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. సీఎం చొరవ తీసుకొని పరిష్కరించాలన్నారు.