కేంద్రం గతంలో ఇచ్చిన నిధులనే కొత్తగా రిలీజ్ చేస్తున్నట్లు బిల్డప్
రాబోయే వరంగల్ ఎలక్షన్స్ లో లబ్ధి కోసం కొత్త నాటకం
ఇన్నాళ్లూ మ్యాచింగ్ గ్రాంట్ఇవ్వకుండా ఇప్పుడు కొత్త మెలిక
పనులు చేసి బిల్లులు పెట్టాకే పైసలు ఇస్తామని ప్రకటన
స్టేట్ గవర్నమెంట్ తీరుతో స్మార్ట్ సిటీ పనులు కష్టమే
వరంగల్ రూరల్/కరీంనగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ ఫండ్స్‌తో రాష్ట్ర సర్కారు దొంగాట ఆడుతున్నది. స్మార్ట్ సిటీ స్కీమ్ కింద ఎంపికైన వరంగల్, కరీంనగర్‌లకు ఐదేళ్ల పాటు సెంట్రల్, స్టేట్గవర్నమెంట్స్ఏటా రూ.100 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటికే తన వాటా కింద రెండు విడతల ఫండ్స్ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా సెంటర్ ఇచ్చిన పైసలనూ తన దగ్గరే పెట్టుకున్నది. తీరా ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్‌కు ఎలక్షన్స్ రావడంతో ఇన్నాళ్లూ తన దగ్గరే ఉన్న సెంట్రల్ ఫండ్స్‌నే కొత్తగా వరంగల్‌కు తానే రిలీజ్చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది. మరి మ్యాచింగ్ గ్రాంట్సంగతేంటని అడిగితే కాంట్రాక్టర్లు పనులు చేసి బిల్లులు పెట్టాకే ఇస్తామంటోంది. రాష్ట్ర సర్కారు ఆడుతున్న ఈ నాటకంతో రెండు స్మార్ట్ సిటీలూ నష్టపోతున్నాయి.
రూ. 392 కోట్లు ఇచ్చిన కేంద్రం
వరంగల్, కరీంనగర్ సిటీలను సెంట్రల్ గవర్నమెంట్ 2016లో స్మార్ట్ సిటీ స్కీంలో చేర్చింది. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేండ్లలో ఒక్కో సిటీకి వెయ్యి కోట్లు కేటాయించాలి. కాగా, కేంద్రం మొదటి రెండు విడతలకు సంబంధించి 2016లోనే రెండు సిటీలకు రూ.196 కోట్ల చొప్పున మొత్తం 392 కోట్లు అందించింది. మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర సర్కారు సైతం దాదాపు రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, నాలుగేళ్లు గడిచినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. సరికదా, కేంద్రం ఇచ్చిన ఫండ్స్తన దగ్గరే ఉంచుకొని 2019–2020 వరకు రెండు సిటీలకు చెరో రూ.35 కోట్ల చొప్పున కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే మిగతా రూ.322 కోట్లను ఇన్నాళ్లూ రాష్ట్రం తన దగ్గరే పెట్టుకున్నది. దీంతో పైసల్లేక స్మార్ట్‌సిటీ పనులన్నీ పెండింగ్‌పడ్డాయి. తీరా వరంగల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనుండడం, ఇటీవల బీజేపీ లీడర్లు రాష్ట్ర సర్కారు తీరుపై విమర్శలు చేస్తుండడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ బుధవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాము వరంగల్ సిటీకికేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ ఫండ్స్‌ను దారి మళ్లించలేదని, 2016–17లో రూ.2.50 కోట్లు, 2017–18లో రూ.32 కోట్లు, 2020–21లో 161.90 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అర్వింద్‌కుమార్ చెప్పినదాని ప్రకారం చూసినా 2016లో వచ్చిన ఫండ్స్‌ను ఇన్నాళ్లూ రాష్ట్ర సర్కారు తమ దగ్గరే పెట్టుకొని, తీరా వరంగల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రిలీజ్ చేసినట్లు స్పష్టమవుతోంది.
బిల్లు పెడితేనే మ్యాచింగ్ గ్రాంట్
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు ఐదేళ్లు. ఈలెక్కన 2022 జూన్ కల్లా పనులు కంప్లీట్ కావాలి. ఇందుకోసం రాష్ట్ర సర్కారు ఏటా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడంతోపాటు వచ్చిన ఫండ్స్‌ను ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎన్ని ఫండ్స్ ఉన్నాయి? తదితర వివరాలతో యుటిలైజేషన్ సర్టిఫికెట్ల(యూసీల)ను ప్రతి ఏటా కేంద్రానికి సమర్పించాలి. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సబ్మిట్ చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా స్టేట్గవర్నమెంట్ స్పందించకపోవడం, మ్యాచింగ్ గ్రాంట్స్ రిలీజ్ చేయకపోవడంతో కేంద్రం నుంచి రెండు విడతల నిధులు సుమారు రూ.400 కోట్లు ఆగిపోయాయి. తాజాగా ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ ఇప్పట్లో రాష్ట్ర సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ఇవ్వబోదన్నట్లుగా చెప్పారు. కాంట్రాక్టర్లు పనులన్నీ చేశాక.. ఆఫీసర్లు వాటి బిల్లులు పెట్టాక ఇస్తామన్నారు. ఈ లెక్కన రాష్ట్రం స్మార్ట్ సిటీల్లో ఇప్పటివరకు రూపాయి కూడా పెట్టలేదనే నిజాన్ని ఒప్పుకున్నట్లయింది. మ్యాచింగ్‍గ్రాంట్ ముందుగా ఇవ్వకుంటే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లెవరూ రారని, పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయని ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు.
కరీంనగర్ సంగతేంది?
వరంగల్ సిటీకి కేటాయించిన ఫండ్స్‌ను మూడు విడతల్లో కార్పొరేషన్‌కే ఇచ్చేశామని బుధవారం ప్రకటించిన ఎంఏయూడీ ప్రినిసపల్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ ఎక్కడాకరీంనగర్ పేరెత్తలేదు. సెంటర్ ఇచ్చిన ఫండ్స్‌ను తన దగ్గరే పెట్టుకున్న రాష్ట్ర సర్కారు 2019–2020 ఆర్థిక సంవత్సరం వరకు కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్లకు రెండు విడతల్లో కేవలం రూ.35 కోట్లు మాత్రమే ఇచ్చింది. త్వరలో వరంగల్కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉండడంతో కేవలం వరంగల్‌కు మాత్రమే రూ.161.90 కోట్లను ఇటీవల రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తమ సంగతేంటని కరీంనగర్ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో స్మార్ట్‌సిటీ కింద రూ.1,878 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. ఐదేళ్ల పాటు సెంటర్, స్టేట్చెరో రూ.100 కోట్ల చొప్పున ఇస్తే వెయ్యి కోట్లు వస్తాయని భావించారు. మరో రూ. 878 కోట్లు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని భావించారు. ఇప్పటికే మూడేండ్లు గడిచిపోగా, సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్‌ను ఇన్నాళ్లూ తన దగ్గరే ఉంచుకున్న రాష్ట్ర సర్కారు కరీంనగర్‌కు కేవలం రూ. 35 కోట్లు మాత్రమే ఇవ్వడంతో పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. ప్రధానంగా రూ. 327.33 కోట్లతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. మల్టీ పర్పస్ స్కూల్ ఆవరణలో చేపట్టిన పార్కు పనులు 15 శాతం కూడా కాలేదు. స్మార్ట్ సిటీ ప్యాకేజీ -1, 2 కింద రూ.222 కోట్లతో చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు. మూడో ప్యాకేజీ కింద రూ. 53 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులదీ ఇదే పరిస్థితి. రూ. 191.90 కోట్లతో తలపెట్టిన నిరంతర నీటి సరఫరా, సిగ్నలింగ్, సెక్యూరిటీ కెమెరాలు, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్, బయో మైనింగ్ లాంటి13 ప్రాజెక్టులు డీపీఆర్ దశలోనే ఉన్నాయి. జీబ్రా క్రాసింగ్, ర్యాంపుల నిర్మాణాలకు సంబంధించి పనులు కూడా టెండర్ దశ దాటలేదు. కరీంనగర్ స్మార్ట్‌సిటీగా ఎంపికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల తమకు ఒరిగిందేమీ లేదని పబ్లిక్ విమర్శిస్తున్నారు.
For More News..
మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ తయారుచేసిస్తామంటున్న ఇండియన్ మొబైల్ కంపెనీ
జనవరి21లోగా ఐపీఎల్ ప్లేయర్ల లిస్ట్ ఇవ్వాలి
వ్యాక్సిన్ వస్తోంది.. జాబ్స్ తెస్తోంది..
స్మార్ట్ సిటీ ఫండ్స్‌తో రాష్ట్ర సర్కారు దొంగాట
- తెలంగాణం
- January 8, 2021
లేటెస్ట్
- ఇందిరమ్మ మొబైల్ యాప్ సర్వేను పక్కాగా చేపట్టాలి :అడిషనల్ కలెక్టర్ అంకిత్
- ధరణి తప్పులకు భూ భారతితో చెక్
- పీహెచ్ సీలో డీఎంహెచ్‌వో తనిఖీ
- లెదర్ పార్క్‌లు వినియోగంలోకి తెండి : భూమన్న
- ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్
- భూ సేకరణ స్పీడప్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు
- గడువులోపు సీఎంఆర్ డెలివరీ చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
- పూసుగుంటలో వసతులు కల్పించాలి : పీవో బి.రాహుల్
- మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- జగన్ కు చేసింది చెప్పుకోవడం చేతకావడం లేదు.. కడపలో ఆకాశరామన్న ఫ్లెక్సీ ప్రకంపనలు
Most Read News
- IND vs AUS 3rd Test: టీమిండియాకు పండగ లాంటి వార్త.. నాలుగో టెస్టుకు హెడ్ దూరం
- H1B వీసా రూల్స్ మారాయ్.. తప్పనిసరిగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలివే..
- మెహిఫిల్, దర్బార్ రెస్టారెంట్ల పరిస్థితి కూడా అంతేనా.. ఈ ఫుడ్ తింటే ఇంకేమన్నా ఉందా..!
- Aha Mythological Thriller: జబర్ధస్థ్ కమెడియన్ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?
- IND vs AUS 3rd Test: తప్పు చేసి సారీ చెప్పాడు: హెడ్‌కు ఆకాష్ దీప్ క్షమాపణలు
- Theatre Releases: క్రిస్మస్కు థియేటర్లలో సినిమాల సందడి.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!
- ఆధ్యాత్మికం : ధనుర్మాసం పురాణ కథ ఏంటీ.. వైకుంఠ ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా..? ఉత్తర దిక్కు దేనికి ప్రతీక
- ధనుర్మాసం: గోదాదేవి ఎవరు ? తిరుప్పావై పాశురాలు అంటే ఏమిటి?
- కూర్చొకపోతే సస్పెండ్ చేస్తా.. కేటీఆర్, కౌశిక్ రెడ్డికి స్పీకర్ వార్నింగ్
- నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్