- మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విద్యా శాఖ కార్యదర్శిగా యోగితా రాణాను నియమించింది. కేంద్ర సర్వీసులో నుంచి రాష్ట్రానికి వచ్చి వెయిటింగ్లో ఉన్న ఆమెను ఎడ్యుకేషన్సెక్రటరీగా అపాయింట్ చేసింది.
గతంలో ఆమె ఎస్సీ డెవలప్మెంట్కమిషనర్గా పనిచేశారు. ఎడ్యుకేషన్‌లో ఉన్న ఎన్. శ్రీధర్‌ను బదిలీ చేసి మైన్స్ అండ్జియాలజీ సెక్రటరీగా నియమించింది. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ సురేంద్ర మోహన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా సర్కారు బదిలీ చేసింది.