యాదాద్రి, వెలుగు: సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వాగు లో చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రూ. 3కోట్ల46 లక్షల 60వేల నిధులతో శంకుస్థాపన చేశారు. అనంతరం కొలనుపాక గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఆలేరు పట్టణంలో 50లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనంతో పాటు ఇందిరమ్మ డెమో ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆలేరు మండలలోని వివిధ గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గంధమల్ల నుంచి మరోసారి రైతులకోసం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.