ఇకపై చట్టంగా భూభారతి..మెరుగైన రెవెన్యూ సేవలు

  • బిల్లును ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్​వర్మ
  • గెజిట్​ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్​ సెక్రటరీ
  • ధరణి పేరు భూ భారతిగా మార్పు!
  • ఫిబ్రవరి రెండోవారం కల్లా గైడ్​లైన్స్: మంత్రి పొంగులేటి 
  • మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: శాసన సభ, మండలి ఆమోదించిన భూ భారతి బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజముద్ర వేశారు.  డిసెంబర్ 20న ఈ బిల్లును అసెంబ్లీ, 21న శాసనమండలి ఆమోదించాయి. 

డిసెంబర్ 30న గవర్నర్ కార్యాలయానికి బిల్లు చేరింది. ఈ క్రమంలో గురువారం భూ భారతి చట్టాన్ని గవర్నర్​ఆమోదించారు. ఆ వెంటనే భూ భార‌తి  గెజిట్  కాపీని సెక్రటేరియెట్​లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి న‌వీన్ మిట్టల్​ అంద‌జేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా భూ భారతి చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తెస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన గైడ్​లైన్స్​ రెడీ చేస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి రెండోవారం కల్లా మార్గదర్శకాలు ఫైనల్​ చేస్తామని వెల్లడించారు. 

ఇకపై ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  ఆర్వోఆర్ చట్టం–- 2020 వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత బీఆర్ఎస్​ సర్కారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని పొంగులేటి విమర్శించారు. 

కొందరికి సేవ చేయడానికి మాత్రమే పరిమితమైన రెవెన్యూ సేవలను.. అందరికీ ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చర్యలు  చేపట్టిందని వివరించారు.  ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌ని, ఇందుకు సంబంధించిన  క‌స‌రత్తు ఇప్పటికే కొలిక్కి వ‌చ్చిందని చెప్పారు.కాగా, భూ భారతి చట్టరూపం దాల్చడంతో ధరణి వెబ్​ పోర్టల్​ పేరు ను సైతం భూ భారతిగా మార్చనున్నారు. 

ల్యాండ్​ ట్రిబ్యునళ్లపై తుది కసరత్తు 

భూ భారతి చట్టం మార్గదర్శకాల్లో ల్యాండ్​ ట్రిబ్యునళ్ల ఏర్పాటుపై స్పష్టత రానున్నది. అవసరాన్ని బట్టి ట్రిబ్యునళ్ల సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. జిల్లా స్థాయిలోనే రెండంచెల అప్పీల్ వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థ తీసుకురాబోతున్నది. 

ఏ విధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన భూ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యలున్నా  కోర్టుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లకుండా జిల్లాస్థాయిలోనే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కారం దొరికేలా కొత్త చట్టంలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర కార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అప్పీల్ చేసుకోలేని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాయం అందించనున్నది. 

కాగా, ట్రిబ్యునళ్ల పరిధి, అధికారులు ఎందరు ఉండాలి? ఎవరి పాత్ర ఏంటి? అనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండగా.. మార్గ దర్శకాల తర్వాత ఆరు మాడ్యూళ్లకు కుదించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా తుది కసరత్తు జరుగుతున్నదని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు.