
హన్మకొండ జిల్లా : రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇవాళ ఓరుగల్లులో పర్యటించనున్నారు. మహాశివరాత్రి సందర్బంగా హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. హైగ్రివాచారి గ్రౌండ్ లో ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి మహోత్సవాల్లో గవర్నర్ తమిళి సై తోపాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. శివరాత్రి జాగారం ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు.