ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా సైనిక సంక్షేమ శాఖను రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభిందించారు. 2022 సంవత్సరానికి గాను సాయుధ దళాల ఫ్లాగ్ డేను సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక నిధులుసేకరించినందుకు గురువారం అవార్డు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు రిటైర్డ్ కల్నల్ రమేశ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి కే శ్రీరామ్, కార్యాలయ సిబ్బంది కే శ్రీనివాసరావు, వాసు తదితరులు పాల్గొన్నారు.