
- ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించాలి
హనుమకొండ, వెలుగు: పీహెచ్ సీల్లో మెరుగైన సేవలందించి, ప్రజల వైద్య ఖర్చులను తగ్గించాలని స్టేట్హెల్త్డైరెక్టర్ డా.రవీంద్రనాయక్ సూచించారు. హనుమకొండజిల్లాలోని దామెర పీహెచ్సీని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సిన్ స్టోర్,ఆయుష్ విభాగాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీహెచ్రవీంద్ర నాయక్ మాట్లాడుతూ ఫీల్డ్ లెవల్ లో ఆశాలు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు ప్రజలకు పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా పెద్దాస్పత్రులకు వెళ్లకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. టీబీ,లెప్రసీ, ఎన్సీడీ కింద గుర్తించిన బాధితులకు తగిన చికిత్స అందించాలని ఎప్పటికప్పుడు పేషెంట్ల ఆరోగ్యాన్ని ఫాలో అప్ చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్వో ఎ.అప్పయ్య, పీవోడీటీటీ కె.లలితాదేవి, ప్రోగ్రాం ఆఫీసర్లు హిమబిందు, ఇస్తేదార్ అహ్మద్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.