అభివృద్ధిలో తెలంగాణ నంబర్​ వన్.. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ

  • అభివృద్ధిలో  తెలంగాణ నంబర్​ వన్.. పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్
  • అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు
     

ఖమ్మం టౌన్, వెలుగు : కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నంబర్​ వన్​గా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్ రూరల్ డివిజన్ రఘునాథపాలెం మండల పరిధిలో రూ.50 లక్షలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని, మరో రూ.50 లక్షలతో నిర్మించిన తహసీల్ ​బిల్డింగ్ ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ తోపాటు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. అద్భుతమైన పనితీరుతో దేశంలో నెంబర్ వన్ పోలీసింగ్ గా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకం ద్వారా అనేక కేసులను ఛేదించగలుగుతున్నారని చెప్పారు.
 
సాదుకుంటారో.. సంపుకుంటారో మీ ఇష్టం..

మండలాన్ని సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.254 కోట్లతో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో సాదుకుంటారో.. సంపుకుంటారో మీ ఇష్టమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మండలానికి పరిపూర్ణమైన రూపాన్ని తీసుకొచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాల్లో న్యూ బిల్డింగ్ లను ఏర్పాటు చేసుకున్న మొదటి మండలంగా రఘునాథపాలెం నిలిచిందన్నారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పేవారు వస్తున్నారని, ధరణి పోర్టల్ పోతే రైతుబంధు, రైతుబీమా పోతాయని, విపక్షాల మాటలు నమ్మొద్దని ఆయన కోరారు. ఖమ్మం నగరం సీక్వెల్ రోడ్ లో రూ.4 కోట్లతో నిర్మించనున్న నూతన షాదీఖానా పనులకు హోంమంత్రితోపాటు పువ్వాడ శంకుస్థాపన చేశారు. ప్రోగ్రాంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ తాతా మధు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూదన్, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ట్రైనీ ఏఎస్పీ అవినాశ్​కుమార్, జడ్పీటీసీ మాలోతూ ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరీ, సర్పంచ్ గుడిపూడి శారద, ఏసీపీ బస్వారెడ్డి, సీఐ రాజీరెడ్ది, తహసీల్దార్ నరసింహారావు, ఎస్సై రవి పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా  సమగ్రాభివృద్ధే ధ్యేయం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని రాష్ట్ర రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ ఆఫీస్​నిర్మించి ఏడాదైన సందర్భంగా మేయర్​నీరజతో కలిసి కేక్​కట్ చేశారు. సుపరిపాలన దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ఏడేళ్లుగా ఖమ్మం కార్పొరేషన్​అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పారిశుధ్యం కోసం గతంలో11ట్రాక్టర్లు ఉండేవని ఇప్పుడు అనేక ఆధునాతన వాహనాలు సమకూర్చుకున్నామన్నారు. కార్పొరేషన్​లో పారిశుధ్యం ముఖ్యమని ఆఫీసర్లు, కార్పొరేటర్లు పారిశుధ్యం నిర్వహణకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. హైదరాబాద్​తరువాత ఖమ్మం అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆధునాతన వెజ్, నాన్​వెజ్ మార్కెట్లు, డ్రైనేజీలతో నగరం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. కార్పొరేషన్​ కమిషనర్ ఆదర్శ్​సురభి, సుడా చైర్మన్​బచ్చు విజయ్​కుమార్, డిఫ్యూటీ మేయర్​ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.