విలేకర్లపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర హౌసింగ్ కమిటీ మెంబర్ రామ్ రెడ్డి

విలేకర్లపై దాడి చేసిన వారిపై  చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర హౌసింగ్ కమిటీ మెంబర్ రామ్ రెడ్డి

కొల్లాపూర్, వెలుగు: వార్త సేకరణ కోసం వెళ్లిన విలేకర్లపై దాడి చేసిన అలివి వలల మాఫియాపై చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర హౌసింగ్ కమిటీ మెంబర్ రామ్ రెడ్డి, తాలూకా అధ్యక్షుడు రాజేందర్  డిమాండ్​ చేశారు. దాడిని ఖండిస్తూ మంగళవారం కొల్లాపూర్ సీఐ కి ఫిర్యాదు చేశారు.  

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం లో వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుల  అలివి వలల మాఫియా  దాడి చేసిందని ,  రాత్రి వేళలో దిక్కుతోచని స్థితిలో జర్నలిస్టులు తమ రక్షణ కోసం   డయల్ 100 కు ఫోన్​ చేసినా.. స్థానిక పోలీసులు స్పందించకపోవడం దారుణం అన్నారు.  ఇలాంటి దాడులను అరికట్టాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బొల్గం  వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు సురేశ్​, జర్నలిస్టులు  వినోద్, కేశవ్, రాజశేఖర్, రమణ  పాల్గొన్నారు.