తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలి: ఠాక్రే

ఇంటింటికీ హాత్ సే హాత్ జోడో యాత్ర వెళ్ళాలనేదే రాహుల్ ఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో హాథ్ సే హథ్ జోడో యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు జోడో యాత్ర చేశారని చెప్పారు. దేశంలోని అన్ని జాతులను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వం  పేద ప్రజలకు చేస్తున్న అన్యాయాలను తెలియచేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ప్రతి నియోజకవర్గపరిధిలోనూ బ్లాక్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, వాడవాడలో ఇంటింటికీ యాత్ర చేరాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఠాక్రే సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ యాత్ర నిర్వహించి సత్తా చాటాలన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పారు.