ఆనాటి పరిస్థితులు చూసి బాధపడ్డది కొందరే: కేసీఆర్

ఆనాటి పరిస్థితులు చూసి బాధపడ్డది కొందరే: కేసీఆర్

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత అమర వీరులకు పుష్పాంజలి ఘటించి ఉద్యమ నాటి అనుభవాలను గుర్తిచేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రొ. జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన కృషిని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు చూసి కొద్దిమందిమే భాదపడేవారిమని కేసీఆర్ అన్నారు. 

కరువులు, వలసలు, ఆత్మహత్యలు ఉండేవని, అంసెబ్లీలో తెలంగాణ అనే పదమే వాడొద్దని స్పీకర్ అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రాంతం వాళ్లే కొందరు స్వరాష్ట్రాన్ని వ్యతిరేకించారని కేసీఆర్ అన్నారు. ఉద్యమం చేస్తుంటే వారు అవహేళన చేశారని చెప్పారు. టీఆర్ ఎస్ పార్టీ ఏర్పడిందే తెలంగాణ ప్రాంత సంరక్షణ కోసమని కేసీఆర్ పునరుద్ఘాటించారు.