- అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు: ఎనిమిదేండ్ల వయస్సున తెలంగాణ యావత్ దేశానికి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని కొత్త కలెక్టరేట్లో మంత్రి జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో 65 ఏండ్లపాటు పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్‌సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దళితబంధు స్కీమ్‌లో మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున జిల్లాలో 550 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి ప్రకటించారు.