కేటీఆర్ పర్యటన.. బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్ 

నేరేడుచర్,వెలుగు : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు చేయనున్నారు. హుజూర్‌నగర్ చేపట్టిన పనులను పరిశీలించనున్ననారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు నేరేడుచర్ల బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు బీజేపీకి చెందిన ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. 

మంత్రి కేటీఆర్ పర్యటనకు బీజేపీ నాయకులు అడ్డుకుంటారన్న అనుమానంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో నేరేడుచర్ల మండలం, పట్టణ అధ్యక్షులు పార్థన బోయిన విజయ్ కుమార్ యాదవ్, సత్యనారాయణ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, పవన్ ఉన్నారు. పోలీసుల చర్యలు బీజేపీ నేతలు కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.