హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పల్లె నాగేశ్వర్ రావును నియమిస్తూ రాష్ట్ర న్యాయ శాఖ జీవో నం 65ను జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హైకోర్టు బార్ అసో సియేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో ప్రభుత్వ కేసులను వాదించే నిమిత్తం అయిదుగురిని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులుగా నియమిస్తూ గురువారం మరో జీవో 66 ను విడుదల చేసింది.
ఇప్పటికే ఏజీ, ఇద్దరు అదనపు ఏజీలను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు అయిదుగురు న్యాయవాదులు శ్రీధర్‌రెడ్డి, ఐవీ సిద్ధివర్ధన, రాహుల్‌రెడ్డి సొంటిరెడ్డి, రామకృష్ణ మల్లోజల, స్వరూప్ ఊరిళ్లలను ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్లుగా నియమించింది.