మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు చక్రవర్తి కోరారు. మండలంలోని ఎక్లాస్పూర్ వద్ద ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం 9వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. బండారి నర్సప్ప, మహదేవ్, రవీందర్రెడ్డి, బండారి మల్లేశ్, తిరుపతయ్య, వెంకటయ్య, కురుమూర్తి, సత్తమ్మ, కొండమ్మ ఉన్నారు.