పక్షి ప్రేమికుడికి రాష్ట్రస్థాయి అవార్డు

పక్షి ప్రేమికుడికి రాష్ట్రస్థాయి అవార్డు

బోథ్, వెలుగు: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బోథ్ మండల కేంద్రానికి చెందిన పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేశ్​కు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్​లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక అధ్యక్షుడు పురుషోత్తం పురస్కారం అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు పర్యావరణం, ప్రకృతి గురించి అవగాహన కల్పిస్తూ పక్షులకు బర్డ్ ఫీడర్లు అందించడంతో పాటు సొంత ఖర్చులతో వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నందుకు గానూవెంకటేశ్​ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.