రాష్ట్రస్థాయి క్యారమ్​ఎంపిక పోటీలు

బెల్లంపల్లి, వెలుగు :  రాష్ట్ర క్యారమ్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్​లో ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి క్యారమ్​ ఎంపిక పోటీలు జరుగుతాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్యారమ్​ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.బాలరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. రాజన్న తెలిపారు. అండర్12, అండర్14, అండర్18, అండర్21 విభాగాల్లో బాల బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తమ ఎంట్రీలను ఈ నెల 18వ తేదీలోగా పంపాలన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరిలో తమిళనాడులోని మధురైలో జరిగే  జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 9440010404ను సంప్రదించాలని కోరారు.