కరీంనగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ - 2024లో భాగంగా ఈ నెల 27 నుంచి 29 వరకు కరీంనగర్ లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ లో రాష్ట్రస్థాయి సీఎం కప్ జూడో పోటీలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జూడో క్రీడాకారులు గురువారం సాయంత్రం రిపోర్ట్ చేయనున్నారు. శుక్రవారం ఉదయం పోటీలు ప్రారంభించి ఆదివారం మధ్యాహ్నం వరకు ముగించనున్నారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో విజేతలకు సీఎం కప్‌ను ప్రదానం చేస్తారు.