కొత్తగూడెంలో రాష్ట్ర స్థాయి క్రికెట్​ పోటీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ప్రవీణ్​ మెమోరియల్​ ఆర్జేఎం కప్​రాష్ట్ర స్థాయి క్రికెట్​ పోటీలు గురువారం  కొత్తగూడెంలోని  సాధన గ్రౌండ్​లో మొదలయ్యాయి. పోటీలను రాజేందర్​ సేవా సంస్థ అధ్యక్షులు యెర్రా కామేశ్​, సీనియర్​ అడ్వకేట్​ జీవీ మనోహర్​ ప్రారంభించారు.  క్రీడలతో  స్నేహభావం పెరుగుతుందని వారన్నారు.  ఈ ప్రోగ్రాంలో సాయి, శరత్​, శివ, జేమ్స్​, సర్వేశ్​ పాల్గొన్నారు.