కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్14 బాలబాలికల హాకీ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో నిజామాబాద్మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు రెండు
మూడు స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ విజేతగా నిలవగా, నిజామాబాద్, రంగారెడ్డి టీమ్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజేతలకు డీఈవో రాజు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ రసూల్, సాయిమౌర్య తదితరులు పాల్గొన్నారు.