జనవరి 12 నుంచి చాగల్లులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం చాగల్లులో ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. కడియం ఫౌండేషన్‌‌‌‌, స్వాగతం యూత్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల వాల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ను సోమవారం హనుమకొండలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ పోటీల్లో విజేతకు రూ. 60 వేలు, రన్నరప్‌‌‌‌గా నిలిచిన జట్టుకు రూ. 40 వేలు అందజేస్తామని చెప్పారు. జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు పోగుల సారంగపాణి, స్వాగత్‌‌‌‌ యూత్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు కూన రాజు, సభ్యులు కూన రమేశ్, వేళ్ల రమేశ్, అనిల్, పొన్న రాజేశ్, ప్రజేశ్, యాకయ్య పాల్గొన్నారు.